| Daily భారత్
Logo




టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయండి

News

Posted on 2026-04-20 16:51:57

Share: Share


టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయండి

TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ పిలుపు

డైలీ భారత్, తిప్పాపూర్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించు రాష్ట్ర విద్యా సదస్సుకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కదిలి విజయవంతం చేయ్యాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.

వేములవాడ మండలం తిప్పాపూర్ ఉన్నత పాఠశాలలో టిపిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాద్ రెడ్డి ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య రాష్ట్ర నాయకులు కొలుగూరి కిషన్ రావు గారితో కలిసి విద్యాసదస్సు గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. విద్యా అందరికీ సమానంగా అందకుండా విధానాలు రూపొందిస్తున్నారన్నారు.విద్యారంగానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నిధులను కేటాయించడం లేదని ,వందలాది ప్రభుత్వ పాఠశాల మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం, విద్య అందరికీ సమానంగా అందడం కోసం,విద్యా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని నైబర్హుడ్ కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ రాష్ట్ర విద్యా సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యారంగం సంక్షోభం లో ఉన్నదని పెండింగ్ లో ఉన్న DA లు వెంటనే విడుదల చేయాలని, PRC ప్రకటించి అమలుచేయాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ప్రకటించినట్టు CPS రద్దుచేయాలని, sgt ఉపాధ్యాయులకు సర్దుబాటు నిబంధనలు మార్చాలని, DED, B,Ed, ఉపాధ్యాయులకు ప్రమోషన్ లో సమాన అవకాశాలు కల్పించాలని 2003 dsc ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు,

 TPTF రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్యఅతిథిగా పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్  నవీన్ నికోలాస్ , అతిథిగా ప్రొఫెసర్ ఎం కోదండరాం హాజరుకానున్నారు.

“ నూతన జాతీయ విద్యా విధానం రాజ్యాంగ విలువలు” అను అంశంపై విద్యాపరిరక్షణ కమిటీ నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, “తెలంగాణలో అసమాన విద్య విద్యారంగ సంక్షోభం” అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతకింది కాశీం గారు, ”పచ్చిమాసియా యుద్ధం ప్రపంచ రాజకీయాలు” అనే అంశంపై ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె.శ్రీనివాస్ విద్యా సదస్సులో ప్రసంగించనున్నారు అని తెలిపారు,

ఈరోజు జరిగిన పోస్టర్ ఆవిష్కరణలో మండల విద్యాధికారి లోకిని కిషన్

TPTF బాధ్యులు  జిల్లా ఉపాధ్యక్షులు నూగురి దేవేందర్, కెవి రజినీరాణి, జిల్లా కార్యదర్శులు పార్వతి తిరుపతి గారు మండల బాధ్యులు బొజ్జ కృష్ణ,  శ్రీనివాస్, సంజీవ్ , శ్రీధర్ , మహేష్ , భూస రాజేందర్, సంతోష్ చకినాల భాస్కర్, సునీత, జ్యోతి, నీరజ, సోదర సంఘ బాధ్యులు రామ్ గోపాల్ గారు, ఉపాధ్యాయులు రమేష్, రాజేశం, అశోక్ ,మధుసూదన్ రావు ,రవి ,వెంకటేశం, జీవన్, శరత్, శ్రీనివాస్, బాబు, మొదలగు వారు పాల్గొన్నారు

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >