| Daily భారత్
Logo




జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

News

Posted on 2026-04-21 16:26:02

Share: Share


జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

మాచారెడ్డి, కామారెడ్డి పరిధిలో పేకాట స్థావరాలపై దాడులు: 9 మంది అరెస్ట్, నగదు మరియు వాహనాల స్వాధీనం

అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడును – జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో జూదం, పేకాట వంటి అక్రమ సామాజిక రుగ్మతలను రూపుమాపడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, మంగళవారం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి మొత్తం 9 మంది పేకాటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నగదుతో పాటు మొబైల్ ఫోన్లు మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ తెలిపారు.

మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చుక్కాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ. 3,750 నగదు, 4 మొబైల్ ఫోన్లు మరియు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా, కామారెడ్డి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 7,590 నగదు, 5 మొబైల్ ఫోన్లు మరియు ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. ఈ రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ:

“జూదం అనేది కేవలం ఒక ఆట కాదు, అది ఒక వ్యసనం. క్షణికమైన లాభం కోసం ఆశపడి కష్టార్జితాన్ని కోల్పోవడమే కాకుండా, మీపై ఆధారపడిన కుటుంబాలను కష్టాల్లోకి నెట్టవద్దు. పేకాట ఆడుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

గౌరవప్రదమైన సమాజంలో జూదానికి చోటు లేదని, అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కితే జైలు శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

జిల్లాలో ఎక్కడైనా అక్రమ పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగాo ఉంచుతాము” అని హామీ ఇచ్చారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >