| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

News

Posted on 2026-04-22 04:05:51

Share: Share


ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

డైలీ భారత్, వికారాబాద్‌:  విధి నిర్వహణలో పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి పదేపదే చెప్తున్నా మారని కొందరి తీరు పోలీసుశాఖకు మచ్చ తెస్తోంది. తాజాగా వికారాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ వలలో చిక్కారు. దీంతో నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన పోలీసుల సంఖ్య 8కి చేరింది. రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌, బాధితుల వివరాల ప్రకారం.. తాండూరుకి చెందిన ఇర్షాద్‌పై అతని భార్య 498ఏ కింద కేసు పెట్టింది. దీంతో వరకట్నవేధింపుల కేసుకు సంబంధించి ఆరుగురికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి రూ.60 వేల లంచాన్ని వికారాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ సరోజ, ఎస్‌ఐ రాణి డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని బాధిత కుటుంబం బతిమాలడంతో ఆ మొత్తాన్ని రూ.40వేలకు తగ్గించారు. ఈ క్రమంలో తొలివిడతగా గత నెల 23న మహిళా పోలీసుస్టేషన్‌లో సీఐకు బాధితుడు రూ.20వేలు అందచేశారు. మిగతా డబ్బు ఇవ్వలేక పోవడంతో అతనికి పోలీసు అధికారులు ఫోన్లు చేసి బెదిరించసాగారు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో మంగళవారం బాధితుడి నుంచి నగదు స్వీకరిస్తున్న సమయంలో సీఐ, ఎస్‌ఐలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ సరోజ, ఎస్‌ఐ రాణిలపై కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గత నెల 23న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌ మాజీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాత కేసుకు సంబంధించి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెల 26న నిర్మల్‌ జిల్లా మామడ ఎస్‌ఐ అశోక్‌ రూ.20 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గత నెల 30న నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీ పేట ఎస్‌ఐ హరిప్రసాద్‌ రెడ్డి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కి దొరికారు. ఈనెల 1న చైతన్యపురి ఏఎ్‌సఐ బాలయ్య రూ.15వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 8వ తేదిన హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయ అవుట్‌పోస్టు ఇన్‌స్పెక్టర్‌ సిద్దేశ్వర్‌, ఎస్‌ఐ కనకయ్య లు రూ.2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. అదే రోజు ఎస్‌ఐ కనకయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి రూ.33.97 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >