| Daily భారత్
Logo




ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

News

Posted on 2026-04-22 08:50:38

Share: Share


ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

డైలీ భారత్, బెంగళూరు డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో దగ్గరైన యువతి, ప్రపోజల్‌ పేరుతో తన ప్రియుడిని పన్నాగం పన్ని సజీవదహనం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన బైదరహల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని అంజనానగర్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, కిరణ్‌ మరియు ప్రేరణ ఇద్దరూ టెలికం స్టోర్‌లో పనిచేస్తూ గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ప్రేరణ, కిరణ్‌ను తన ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు మాట్లాడుకున్న ఇద్దరూ, అనంతరం “వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్” అంటూ కిరణ్‌ను నమ్మించింది.

ప్రపోజల్‌లో భాగంగా కిరణ్‌ కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసింది. మొదట అతడు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా, విదేశాల్లో ఇలా చేస్తారని చెప్పడంతో అతను నమ్మాడు. ఇదే ఆమె పథకానికి మొదటి అడుగు అయింది.

ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోల్‌ను కిరణ్‌ ఒంటిపై పోసిన ప్రేరణ, వెంటనే అతనికి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కిరణ్‌ ఆర్తనాదాలు చేశాడు. కానీ అతడిని కాపాడే ప్రయత్నం చేయకుండా ఆమె నిర్లక్ష్యంగా ప్రవర్తించింది.

కిరణ్‌ మంటల్లో అల్లాడుతున్న సమయంలో కూడా ప్రేరణ చలించకుండా ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడం మరింత షాకింగ్‌గా మారింది. అతని అరుపులు విని చుట్టుపక్కల వారు ఇంట్లోకి చేరేసరికి, కిరణ్‌ ఇప్పటికే మృతిచెందాడు.

మొదట ఇది ప్రమాదమని భావించిన స్థానికులు, ప్రేరణే హత్య చేసినట్టు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించగా, “అతను నన్ను పట్టించుకోవడం లేదు.. నన్ను పెళ్లి చేసుకోడని అనుమానం వచ్చింది.. అందుకే చంపేశాను” అని తెలిపింది. ఘటన సమయంలో ఆమె ఇంట్లో తల్లి, సోదరుడు లేరని, ఇది పూర్తిగా పథకం ప్రకారమే జరిగిన హత్య అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ప్రేమ, అనుమానం, ఆవేశం కలిసినప్పుడు ఎంతటి భయంకర పరిణామాలు చోటుచేసుకోవచ్చో స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >