Posted on 2026-04-22 16:40:32
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి: కామారెడ్డి పట్టణం దేవునిపల్లి మధురానగర్ 34వ వార్డులో అంగన్వాడి కేంద్రం సమీపంలో 30 ఫీట్ల ప్రధాన రోడ్డును ఓ వ్యక్తి త్రవ్వేసి నాలుగు ఫీట్ల మేర కబ్జాకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మధురానగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల క్రితం రాజు అనే వ్యక్తి తన ప్లాటు రోడ్డులో పోయిందని ఏకంగా దేవునిపల్లి గ్రామపంచాయతీ కాలం నుంచి ఉన్న ప్రధాన మురికికాల్వలను త్రవ్వేశారు. ఈ విషయమై కౌన్సిలర్ ఆకుల సుజిత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయిన మున్సిపల్ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. రాజు అనే వ్యక్తి బుధవారం రోడ్డు కబ్జా మురికికాలువ నిర్మానం చేపట్టారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి రోడ్డును కాపాడాలని మధురానగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >