| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

News

Posted on 2026-04-25 13:40:44

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

సిడబ్ల్యుసి ఎదుట హాజరు పరిచేందుకు బాలిక తరలింపు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో జరుగుతున్న బాల్యవివాహాన్ని శనివారం అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతోందని రెండు రోజుల క్రితం 1098కు సమాచారం అందడంతో తహసీల్దార్ సుజాత, ఐ .సి.డీ.ఎస్. సిరిసిల్ల సీడీపీఓ ఉమారాణి , సూపర్  వైజర్ వనిత, డీ.సి.పీ.ఓ కవిత చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ స్రవంతి , పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రులను వివరాలు అడిగినా వారు సహకరించకపోగా తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు బాలిక చదివిన పాఠశాల నుంచి రికార్డులు సేకరించగా, 24-08-2009న జన్మించినట్లు ధృవీకరించారు. బాలిక వయస్సు చట్టపరంగా వివాహానికి తక్కువగా ఉండటంతో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి వివాహాన్ని నిలిపివేశారు. ఈ సమయంలో బాలిక బంధువులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అంగన్వాడి టీచర్ సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ ఆమెపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించిన ఘటన కూడా జరిగింది. అనంతరం బాలికను బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరు పరిచేందుకు సిరిసిల్లకు తరలించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, అలాంటి వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >