Posted on 2026-04-27 15:57:31
విద్యా వాలంటీర్లను కేటాయించాలి
జనగామ గ్రామ సర్పంచ్
కామారెడ్డి, బీబీపేట్
డైలీ భారత్, కామారెడ్డి: బిబిపేట మండలంలోని జనగామ గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 9వ, 10వ తరగతులకు సరిపడా ఉపాధ్యాయులు లేని కారణంగా వెంటనే టీచర్లు, విద్యా వాలంటీర్లను కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులతో కలిసి డి.ఇ.ఓ. కార్యాలయ ఏడి శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతినకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కప్పేరా రవీందర్ రెడ్డి, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ బోధస్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >