| Daily భారత్
Logo




కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2026-05-03 18:11:11

Share: Share


కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్ పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు 18 పండ్ల దుకాణాలు, పాన్ షాపులు మరియు టీ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు తమ ఆస్తులను కాపాడుకునేలోపే భారీ నష్టం వాటిల్లింది.

ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  కుమారుడు, రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఆయనతో పాటు డిసిసి మాజీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు 

పండ్ల రాజు, ఇప్ప శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన మహమ్మద్ ఇలియాస్, జరిగిన నష్టాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి, బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంలో ఆస్తి కోల్పోయిన వ్యాపారులను ఆదుకోవడానికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ఘటనతో పాత బస్టాండ్ ప్రాంతంలో ఆర్థికంగా ఆధారపడిన పలువురు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తరఫున బాధితులకు నష్టపరిహారం అందెల కృషి చేస్తామన్నారు

Image 1

బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-06-20 12:14:40

Readmore >
Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >