| Daily భారత్
Logo




బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

News

Posted on 2026-05-04 08:54:09

Share: Share


బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం బయటపడింది

డైలీ భారత్, హైదరాబాద్: నిఝాంపేట్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి దొప్పలపూడి రవీంద్ర తనకు 1983లో కొనుగోలు చేసిన రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 404, 405 లోని ప్లాట్ నం.108 (300 గజాలు) పై ఇతరుల పేర్లతో నకిలీ సేల్ డీడ్లు నమోదయ్యాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. 

విచారణలో నిందితులు ఖాళీగా ఉన్న ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని అసలు యజమాని లేరని భావించి నకిలీ లింక్ డాక్యుమెంట్లు నెంబర్ సృష్టించి, డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డి మరియు సబ్-రిజిస్ట్రార్ రెహమాన్ తో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి పలుమార్లు అమ్మినట్లు బయటపడింది. ఈ క్రమంలో ప్లాట్‌కి నఖిలి ఓనర్ గా ధర్మారావు ని సృష్టించి అతను ప్రదీప్ కుమార్ కి, ప్రదీప్ కుమార్ ఆ ప్లాట్ లను రెండుగా విభాజించి ప్రభాకర్, నరేష్ లకి, తరువాత వారిద్దరూ కలిసి గుబ్బల వెంకటేశ్వర్ రావు (GVR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కి రిజిస్ట్రేషన్ చేస్తూ, చివరకు జంగాల శ్రీరామ్ మరియు అతని భార్య విజయలక్ష్మి పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారు. 

ఇట్టి కేసు విచారణ లో నిందితులు అందరు ఒక గ్రూప్ గా మారి తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నకిలీ డాకుమెంట్స్ ద్వారా ప్లాట్స్ లను కబ్జా చేసి అమాయకులకి అమ్మి మోసం చేస్తున్నామని  నిందితులు ఒప్పుకున్నారు. 

ఇట్టి కేసులో తేది: 03 .05.2026 కీసర పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టు లొ హాజరుపరచి, జుడీష్యల్ కస్టడీ కి పంపించడం జరిగినది.  ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతున్నది. 

ఈ కేసు లొ సమగ్ర విచారణ జరిపిన జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయలు, దర్యాప్తు అధికారి యస్ ఐ అనిల్ కుమార్ మరియు కీసర సిబ్బంది ని అభినందించనైనిది.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >