| Daily భారత్
Logo




నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

News

Posted on 2026-05-04 15:44:15

Share: Share


నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

భూసార పరీక్షలు చేయించాలి

సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు చేయాలి.

రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సేవలు వినియోగించుకోవాలి.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా నేలల సంరక్షణ.. ఎరువుల యాజమాన్యం.. ప్రకృతి వ్యవసాయం, సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కార్యక్రమం.

డైలీ భారత్, తంగళ్లపల్లి : సాగులో నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా నేలల సంరక్షణ.. ఎరువుల యాజమాన్యం.. ప్రకృతి వ్యవసాయం, సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు పై తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ముందుగా జయ జయహే తెలంగాణ పాటను వినిపించారు. నేలల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు సాగులో యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, దిగుబడి, సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వ బోనస్ తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులను సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. అరైవ్.. అలైవ్ కింద వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించామని తెలిపారు. డ్రైవర్లకు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు. మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. పోషకాహారం, ఇతర సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు. ఈ నెల 04 వ తేదీ నుంచి 09 వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేలలు అన్ని ఒకే పోషకాలతో ఉండవని పేర్కొన్నారు. ఒక్కో నేలలో ఒక్కో విధమైన పోషకాలు ఉంటాయని వెల్లడించారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించాలని, దీంతో భూసార వివరాలు వస్తాయని తెలిపారు. దానికి అనుగుణంగా నేలలో ఏ పంట వేయాలి.. ఏ ఏ ఎరువులు, పురుగు మందులు ఎంత మోతాదులో వినియో గించాలో తెలుస్తుందని వెల్లడించారు. ఇష్టారీతిన ఎరువులు, పురుగు మందులు వాడటంతో నేల నిస్సారం అవుతుందని తెలిపారు. ఇష్టారీతిన ఎరువులు, పురుగు మందులు వాడిన పంట ఉత్పత్తుల వినియోగంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు కచ్చితంగా శాస్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాగు చేయాలని  సూచించారు. 

 సన్నవడ్లు సాగు చేయాలి

రేషన్ దుకాణాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అందరూ సన్న బియ్యం వినియోగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లు సాగు చేసే రైతులకు బోనస్ అందిస్తుందని వివరించారు. విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు సన్న వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. అధిక దిగుబడి, లాభాలు ఉన్న ఆయిల్ పామ్ ను రైతులు సాగు చేయాలని సూచించారు. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, అంతర పంటల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారని గుర్తు చేశారు. రైతులు 

ఆయిల్ పామ్ సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగం, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్, డీపీఓ షర్ఫుద్దీన్, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >