Posted on 2026-05-04 18:00:43
డైలీ భారత్, వరంగల్: నకిలీ నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మార్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మరియు తెలంగాణలో తక్కువ డబ్బులకు, ఎక్కువ డబ్బులను 1:3లో తయారుచేసి ఇస్తామని చెప్పి కోరిన వారికి రూపాయలు 500 నోట్ల పరిమాణంలో నల్ల కాగితలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగురు వ్యక్తులను వరంగల్ టాస్క్‌ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలీ నోట్లను, అసలు 1,48,000 రూపాయలను మరియు సుమారు 28 లక్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్, 13 సెల్‌ఫోన్లు మరియు రెండు కార్లులను స్వాధీన పరుచుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు: 1) శాగంటి కిరణ్, నివాసం: నర్సంపేట; 2) నీరటి శివ, నివాసం: నర్సంపేట మరియు 3) నీరటి రంజిత్, నివాసం: నర్సంపేట, 4) గుడికందుల రవి, నివాసం: నర్సంపేట; 5) పోరిక రాజ్‌కుమార్ @ రాజు, నివాసం: ఘన్ పూర్ (ములుగు), 6) తనమాల రాజశేఖర్, నివాసం: వేంసూరు, ఖమ్మం; 7) ముదురుకోల యాకంబరం, నివాసం: తాతానగర్, భువనగిరి; 8) చేను సాయికిరణ్, నివాసం: కారకగూడెం(మండలం), కొత్తగూడెం కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ, నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగ వారు అసలు 100 రూపాయలు నోట్లను ల్యాప్ టాప్ మరియు ప్రింటర్ ద్వారా కలర్ ప్రింట్ తీసి మార్కెట్లో అసలు నోట్లుగా చలామణి చేస్తున్నారని మరియు మిగిలిన ఐదుగురు వ్యక్తులను విచారించగ వారు తెలంగాణ రాష్ట్రంలో తక్కువ డబ్బులకు, ఎక్కువ డబ్బులను 1:3 లో తయారుచేసి ఇస్తామని చెప్పి వారు బాధితులను నమ్మించడానికి, అసలైన 500 రూపాయల కరెన్సీ నోట్లను అయోడిన్ టింక్చర్ ద్రావణంలో ముంచడం ద్వారా వాటిని నల్లగా మార్చి, ఆపై "హైపో" (సోడియం థయోసల్ఫేట్) ద్రావణంలో ముంచగ, రసాయన చర్య ఫలితంగా వాటి అసలు రూపాన్ని తిరిగి వచ్చేలా చేసి, వారి ప్రణాళిక ప్రకారం, వారు నల్లటి రంగు కాగితాలను కట్టలుగా కట్టి, కోరినవారికి ఇచ్చి, వారు పైన చెప్పిన విదంగా చేసినట్లయితే, అవి అసలు నోట్లలాగా మారుతాయని నమ్మించి, వారి వద్ద నుండి అసలు నోట్లు తీసుకొని పరారు అవుతారు. ఇదే విధంగా వారు గతంలో ఘనపూర్ (ములుగు), మోండా మార్కెట్ (సికింద్రాబాద్), వెంసూర్, కొత్తగూడెం, KUC మరియు సుబేదారీ పరిధిలో మోసం చేయగా వారిపై కేసులు నమోదు చేసి, జైల్ కు పంపడం జరిగింది. ఈ మద్యకాలంలో వారు తెలంగాణలో చత్రినాక (హైదరాబాద్) మరియు నర్సంపేటలలో మోసం చేసినట్లు తెలిపినారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన టాస్క్‌ఫోర్స్ ఏసిపి మదుసూధన్, నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాబులాల్, నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎఎఓ సల్మాన్ పాషా, టాస్క్‌ఫోర్స్ మరియు నర్సంపేట సిబ్బందిని సిపి అభినందించారు.
#warangal
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >