Posted on 2026-05-04 18:51:37
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.
కేసు వివరాల ప్రకారం, 2025 సంవత్సరంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ 103 కింద క్రైమ్ నెం. 304/2025గా కేసు నమోదు చేయబడింది. అనంతరం ఈ కేసు ఎస్‌సి నెం. 136/2025గా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారు వనగల్ల గుట్టయ్య (43), తండ్రి ఇదయ్య, వృత్తి టిఫిన్ సెంటర్, నివాసం నర్సింహులగూడెం గ్రామం, నెల్లికుదురు మండలం. నిందితుడు సంపత్ శ్రీను (40), తండ్రి వీరస్వామి, వృత్తి మేస్త్రీ పని, మహబూబాబాద్.
ఈ కేసును మహబూబాబాద్ ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి ఎండీ అబ్దుల్ రఫీ విచారించి నిందితుడిని దోషిగా నిర్ధారించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 235(2) ప్రకారం నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు విచారణలో ప్రత్యేక ప్రజా అభియోగాధికారి కొంపల్లి వెంకటయ్య వాదనలు వినిపించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎన్. జీనత్ (ఎస్‌ఐ, డీసీఆర్‌బీ) వ్యవహరించారు.
దర్యాప్తు అధికారులుగా టి. ప్రశాంత్ బాబు (ఎస్‌ఐ, మహబూబాబాద్ టౌన్) కేసును ప్రారంభించి, అనంతరం పి. సర్వయ్య (సీఐ, మహబూబాబాద్ రూరల్) మరియు జి. మహేందర్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్, మహబూబాబాద్ టౌన్) దర్యాప్తు కొనసాగించి సాక్ష్యాధారాలను సమగ్రంగా సేకరించి కోర్టుకు సమర్పించారు. కేసు పర్యవేక్షణను ఎన్. తిరుపతి (డీఎస్పీ, మహబూబాబాద్) మరియు జి. మహేందర్ రెడ్డి నిర్వహించారు.
కేసు డాక్యుమెంటేషన్ బాధ్యతలను బుక్యా రవీందర్ (పిసి-537, సీడీఓ) నిర్వహించారు.
సాక్ష్యాధారాల బలం, పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనలు కారణంగా నిందితుడికి శిక్ష పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు నేరాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి, సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని కోరారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >