Posted on 2026-05-05 16:16:41
డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నెహ్రు నగర్‌లో ఉన్న కనకదుర్గ ఫంక్షన్ హాల్‌లో భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“పార్టీ బలమే మన ఐక్యతలో ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కట్టుబాటుతో పనిచేస్తే, సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుంది. ముఖ్యంగా మే 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలి” అని అన్నారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ,
“సిరిసిల్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీని మరింత బలపర్చడానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కృషి చేయాలి. రాబోయే కార్యక్రమాలలో అందరూ సమన్వయంతో పనిచేస్తూ పార్టీ విజయానికి తమ వంతు పాత్ర పోషించాలి. ముఖ్యంగా మే 10న జరిగే ప్రధాన మంత్రి పర్యటనను చారిత్రాత్మక విజయంగా నిలపాలని” పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు గరిపెల్లి ప్రభాకర్, సీనియర్ నాయకులు రాజాసింగ్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు మెరుగు శ్రీనివాస్ కొండ నరేష్ మోర శ్రీహరి సురం వినయ్ శ్రీధర్ శేఖర్ పోశెట్టి గాలి శ్రీనివాస్ దూడం సురేష్ అనిల్ నరసయ్య విజయ్ కోడం రవి కోడం శ్రీనివాస్ బాగయ్య మొర రవి తదితరులు పాల్గొన్నారు
కార్యక్రమంలో మే 10న జరగనున్న ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రణాళికలు, కార్యాచరణపై సమగ్ర చర్చ జరిగింది.
ఈ సమావేశం ద్వారా పార్టీ శక్తి, ఐక్యత మరింత బలపడిందని నాయకులు తెలిపారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >