Posted on 2026-05-06 23:24:18
హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భీమవరం శ్రీనివాస్
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల రాజరాజేశ్వర హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భీమవరం శ్రీనివాస్ అన్నారు . భారత్ గ్యాస్ ఏజెన్సీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని గ్యాస్ ఏజెన్సీ ఎదుట జిల్లా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల గ్యాస్ ఏజెన్సీ కరీంనగర్ పేరుతో సిరిసిల్ల జిల్లా కేంద్రానికి లారీ తీసుకోవచ్చి అనుమతి లేకుండా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు పౌర సరఫరాల అధికారులు అక్కడి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పరమేశ్వరి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వేణు , ముస్తాబాద్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దామోదర్ రావు, కొనరావుపేట హెచ్ పి గ్యాస్ నిర్వహకులు గంప అభిషేక్, చందుర్తి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సత్తన్న, సహస్ర గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు బాలకృష్ణ గంభీరావుపేట హెచ్.పీ గ్యాస్ నిర్వహకులు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >