Posted on 2026-05-07 11:10:33
డైలీ భారత్, సిద్దిపేట: వర్గల్ మండలం నాచారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హల్దీ వాగులో ఈతకు దిగిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఓ వివాహ వేడుక సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన పెళ్లి బృందం తూప్రాన్‌కు వెళ్లింది. అయితే వారిలో కొంతమంది యువకులు వివాహ వేడుక అనంతరం నాచారం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
సరదాగా ఈత కొట్టేందుకు పక్కనే ఉన్న హల్దీ వాగులోకి దిగారు. వాగు లోతును సరిగా అంచనా వేయకుండా లోపలికి వెళ్లారు. దీంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నేడు ముగ్గురి మృతదేహాలను గుర్తించి వాగు నుంచి బయటకు తీశారు. మృతులను ప్రశాంత్, వికాస్, కొంతమి ఆనంద్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. వివాహ వేడుకకు వచ్చి మృతిచెందడంతో నవ వధూవరులు సహా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >