| Daily భారత్
Logo




ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

News

Posted on 2026-05-07 12:09:14

Share: Share


ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఓ దారుణ ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరేళ్ల ప్రేమ, మూడేళ్ల దాంపత్య జీవితం, రెండేళ్ల చిన్నారి ఉన్నా.. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త క్షణికావేశానికి లోనై భార్యను నడిరోడ్డుపైనే కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

మృతురాలు 24 ఏళ్ల శిరీష కాగా, నిందితుడు ఆమె భర్త మణిదీప్. వీరిద్దరూ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని శిరీషను ప్రేమించిన మణిదీప్ పెళ్లి చేసుకుని కొంతకాలం సంతోషంగా జీవించాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం.

ఇటీవల మణిదీప్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో శిరీష తన పెద్దమ్మతో కలిసి కోదాడ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడ పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి, మరుసటి రోజు మళ్లీ రావాలని సూచించారు. సమస్య చర్చల ద్వారా పరిష్కారమవుతుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ బయటకు వచ్చిన కొద్దిసేపటికే విషాదం చోటుచేసుకుంది.

పోలీస్ స్టేషన్‌ నుంచి బయల్దేరిన తర్వాత బస్టాండ్ సమీపంలోని టీ స్టాల్ వద్ద ఆటోలో శిరీష కూర్చొని ఉండగా, వెంట తెచ్చుకున్న కత్తితో మణిదీప్ ఆమెపై దాడి చేశాడు. ప్రజలు చూస్తుండగానే విచక్షణారహితంగా కడుపులో పొడవడంతో శిరీష తీవ్ర రక్తస్రావానికి గురైంది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో బస్టాండ్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఇంత క్రూరంగా హత్య చేయడం చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఘటన అనంతరం మణిదీప్ నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి పెద్దమ్మ ఆవేదన వ్యక్తం చేస్తూ.. “నా బిడ్డకు న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆమె కోరింది. సమస్య మాట్లాడుకుని పరిష్కారం అవుతుందని అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు” అంటూ కన్నీరుమున్నీరైంది.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >