Posted on 2026-05-07 19:59:26
సమర్థవంతమైన దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
డైలీ భారత్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి గురువారం నాడు మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కుర్రావత్ రమేష్ (25), మిడ్జిల్ మండలానికి చెందిన వ్యక్తిపై నేరం రుజువుకావడంతో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
2020 నవంబర్ 22వ తేదీన బాధిత బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. అప్పటి ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేయగా, అప్పటి జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్ కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టి బలమైన వాదనలు వినిపించారు. మిడ్జిల్ ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో సీడీఓలు రమేష్, PC 3229 మరియు శంకర్, PC 2194, అలాగే కోర్టు లైజనింగ్ ఏఎస్ఐ బాలకృష్ణ సాక్షులను క్రమపద్ధతిలో కోర్టులో ప్రవేశపెట్టి కేసు విచారణ సాఫీగా జరిగేలా కృషి చేయడంతో కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, ప్రజా అభియోజకులను జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ అభినందించారు.
#MahabubnagarPolice
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >