Posted on 2026-05-08 11:47:46
చిన్నారి సాత్విక శస్త్రచికిత్సకు లైన్ క్లియర్
అరుదైన వ్యాధి బాధితురాలు సాత్వికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.4,86,010లకు ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే
డైలీ భారత్, అవనిగడ్డ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి బొంతు సాత్వికకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చిన్నారి సాత్విక ఆపరేషన్ నిమిత్తం రూ.4,86,010లకు ఎల్ఓసీ పత్రాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అందచేశారు.
మోపిదేవి మండలం చిరువోలు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం బొంతు రాజేష్ - నాగలక్ష్మి దంపతుల కుమార్తె పదకొండేళ్ల సాత్విక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పాప పుట్టినప్పటి నుంచి కంటి చూపు సమస్యతో బాధపడింది. కేవలం పది శాతం మాత్రమే చూపు కనపడుతుందని తెలియడంతో పాపకు చూపు కోసం ఆపరేషన్ చేయిస్తే కొంత చూపు వచ్చింది. 2020 నుండి సాత్వికకు నడక సమస్య వచ్చింది. నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా పడిపోతోంది. చిన్న చిన్న శబ్దాలు విన్నా కింద పడిపోతోంది. కింద పడిపోయినప్పుడు పాపకు రోజు గాయాలు అయ్యేవి. సాత్విక సమస్యపై ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. పాప వైద్యానికి తల్లిదండ్రులు తమ స్థోమత కొద్దీ పరీక్షలు, చికిత్సలు చేయించారు. అయినప్పటికీ పరిస్థితి మారలేదు. తాజా వైద్య పరీక్షలలో చిన్నారి సాత్విక ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధిని విజయవాడ రమేష్ హాస్పిటల్ వారు గుర్తించి ఆపరేషన్ చేస్తే సాత్విక కోలుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సాత్విక ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4,86,010లు ఆర్థిక సహాయం అందేలా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాలను సాత్విక తండ్రి బొంతు రాజేష్ కు అందచేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగి సాత్విక పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
తన కుమార్తె ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధి నయం అయ్యేందుకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరుకు సిఫార్సు చేస్తూ ఎల్ఓసీ జారీ చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కు సాత్విక తండ్రి రాజేష్ ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో బంధువు బాలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >