Posted on 2026-05-08 19:58:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రతా బలగాలతో పాటు సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లలో మావోయిస్టులకు సంబంధించిన 06 డంప్ లను, 05 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా విధులను నిర్వర్తించిన జిల్లా బాంబు డిస్పోజల్ బృందం సభ్యులను ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.అదేవిధంగా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి 10 ఐ.ఇ.డి లను కనుగొని వాటిని అత్యంత చాకచక్యంగా నిర్వీర్యం చేసిన బీడీ టీం సిబ్బందిని అభినందిస్తూ క్లిష్ట పరిస్థితులలో బీడీ టీం ప్రదర్శించిన సమయస్ఫూర్తి,ధైర్యసాహసాలు ఎంతో గర్వకారణమని కొనియాడారు.సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పలు సూచనలు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అటవీ ప్రాంతాలలో తనిఖీలు చేసేటప్పుడు నిర్ణీత నిబంధనలను కచ్చితంగా పాటించాలని,స్వీయ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేశారు.నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ప్రతిభ కనబరిచిన 12 మంది బీడీ టీం పోలీస్ సిబ్బందిని శుక్రవారం ఎస్పీ అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలు,రివార్డులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆపరేషన్స్ రవి, బీడీ టీం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >