| Daily భారత్
Logo




మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

News

Posted on 2026-05-08 20:03:36

Share: Share


మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి

డైలీ భారత్, కామారెడ్డి : బీఆర్ఎస్, కాంగ్రెస్ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అంటూ బీజేపీ కౌన్సిలర్లు చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి తప్పుబట్టారు. పట్టణంలోని  మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్  నివాసంలో శుక్రవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. పలు మున్సిపాలిటీలను ఉదహరిస్తూ.. అక్కడ మీరు మద్దతు తెలిపితే తప్పులేదు కానీ.. తాము మద్దతిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడడం సరికాదన్నారు. ఛైర్మన్, కో–ఆప్షన్ ఎన్నిక సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్​కు మద్దతు తెలపాల్సి వచ్చిందన్నారు. కేవలం కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి కోసమే మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు భైంసా , అమన్ గల్, ఖానాపూర్​తో పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​కు మద్దతు తెలిపి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు బీజేపీ దక్కించుకోలేదా అని నిలదీశారు. విమర్శలు మానుకుని అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని సూచించారు. బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపనతో కామారెడ్డి అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లలో కామారెడ్డికి ఎమ్మెల్యే కేవీఆర్​  చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాసర్ల గోదావరి-స్వామి, కౌన్సిలర్లు అరికెల ప్రభాకర్ యాదవ్, మామిండ్ల లక్ష్మణ్, మన్సూర్ అలీ, అజీజ్, హఫీజ్ బేగ్, లోలం శ్రీనివాస్, కో–ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్ పాల్గొన్నారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >