Posted on 2026-05-10 11:10:13
మరొకరితో పెళ్లికి సిద్ధం.. పోలీసులకు ఫిర్యాదు..
కేసు నమోదు..
పరారీలో వాడపల్లి దేవస్థానం ఉద్యోగి...?
ప్రేమించానన్నాడు.. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..
డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్: తీరా ప్రేమించిన యువతికే తెలియకుండా రహస్యంగా మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమెతో కలిసి పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లగా, అప్పటికే మరో మహిళతో పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకుని పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైన ఆ యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు తెలిసింది. ఇంటికి తాళాలు వేసి ఉండటంతో పోలీసులు వెనుదిరిగి, బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మండపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిరు ఉద్యోగిగా పనిచేస్తూ, ఒక మహిళను ప్రేమ పేరుతో మోసం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామానికి చెందిన దేవస్థానం ఉద్యోగి పడాల భుజంగరావుపై తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలు సదాపర్తి లక్ష్మీకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. వాడపల్లి దేవస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తున్న భుజంగరావు తనతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గత ఆరు సంవత్సరాలుగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఇటీవల పెళ్లి విషయమై ఒత్తిడి చేయగా భుజంగరావు ముఖం చాటేశాడని, మరో మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని పేర్కొంది.
ఈ విషయంపై నిలదీయగా అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేసి, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా ఈ నెల 8న భుజంగరావు మరో వివాహానికి సిద్ధమయ్యాడని సమాచారం అందడంతో బాధితురాలు పోలీసుల సహాయంతో అతని ఇంటికి వెళ్లింది. అయితే సమాచారం అందుకున్న భుజంగరావు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు తన ప్రేమ వ్యవహారం, ఒక మహిళతో సహజీవనం విషయాన్ని దాచిపెట్టి తమ కుమార్తెతో వివాహానికి సిద్ధమైనట్లు తెలిసి, పెళ్లి కుదుర్చుకున్న కుటుంబ సభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. తమను మోసం చేసి పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >