Posted on 2026-05-10 08:24:05
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు.ప్రధాని ఆదివారం హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా ఎంపీ రవిచంద్ర శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు విడుదల చేయాల్సిందిగా,బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెల్పాల్సిందిగా, ఖాజీపేటలో రైల్వే మానిఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు పచ్చజెండా ఊపాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రధానమంత్రి మోడీని కోరారు.అదేవిధంగా తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)నెలకొల్పాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు విడుదల చేయాలని,మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మించాలని ఆయన కోరారు. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)రైల్వేస్టేషన్ ఏర్పాటై 2032 నాటికి 100 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా డివిజన్ ఏర్పర్చాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా జవహర్ నవోదయ పాఠశాలలు కేవలం 16 మాత్రమే ఉన్నాయని,జిల్లాకొకటి చొప్పున మరో 17,రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 సైనిక్ స్కూల్స్ మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు.ప్రజల కోరిక మేరకు భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిన అవసరాన్ని తన ప్రకటన ద్వారా ఎంపీ రవిచంద్ర ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు.అలాగే,జనగణన సందర్భంగా కులగణన చేపట్టాలని,చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్లతో పాటుగా అమలు చేయాల్సిందిగా ప్రధానమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.ఓబీసీల సంక్షేమం, అభ్యున్నతికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >