| Daily భారత్
Logo




“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”

News

Posted on 2026-05-10 13:12:35

Share: Share


“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”

డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: మానసిక ఆరోగ్య రంగంలో గత 16 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్‌కు ప్రతిష్టాత్మక “మైండ్ అండ్ మెరిట్ అవార్డ్” ప్రదానం చేయబడింది. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ తెలిపారు.

హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో  మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా కనుకుంట్ల పున్నంచందర్ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మానసిక ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పున్నంచందర్‌ను అభినందించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులు, యువత, కుటుంబాలకు కౌన్సెలింగ్ సేవలు అందించడం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించడం వంటి సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

కనుకుంట్ల పున్నంచందర్ మాట్లాడుతూ, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా మానసిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కృషి కొనసాగిస్తానని తెలిపారు.

Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >