Posted on 2026-05-11 07:20:06
డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్‌గా, సైకాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ యెలగొండ ఆంజనేయులు కి “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026” ప్రదానం చేయబడింది.
సైకాలజీ రంగంలో దాదాపు పదేళ్లపాటు విశేష సేవలు అందించినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు. ఈ అవార్డును TPA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో, మాజీ గవర్నర్ మరియు కేంద్ర మంత్రిగా, వివిధ హోదాల్లో సేవలందించిన బండారు దత్తాత్రేయ మరియు మాజీ జాతీయ మహిళా కమిషన్ శ్రీమతి త్రిపురాణ వెంకట రత్నం గార్ల చేతుల మీదుగా ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ అవార్డు అందుకోవడం పట్ల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి, తోటి సైకాలజిస్ట్లు, అధ్యాపకులు, మిత్రులు, మేధావులు, ప్రముఖులు, విద్యావేత్తలు మరియు పలువురు అభినందనలు తెలియజేశారు. డా. ఆంజనేయులు గారి సేవలు మానసిక ఆరోగ్య అవగాహనకు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి విశేషంగా దోహదపడినట్లు వారు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని సభలో పలువురు అభిప్రాయపడ్డారు.
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >