Posted on 2026-05-11 11:53:42
అనారోగ్యాన్ని లెక్కచేయని చదువు… హస్మిత విజయగాథ అందరికీ ఆదర్శం
డైలీ భారత్, అశ్వాపురం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తురుమలగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్ నాయక్, అరుణ దంపతుల కుమార్తె గుగులోత్ హస్మిత పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ S.I.S లో చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శంకర్ నాయక్ కుమార్తెహస్మిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత ఆగస్టు నెల నుంచి ఇంట్లోనే ఉంటూ చదువును కొనసాగించింది. ఆరోగ్యం సహకరించకపోయినా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివి పదో తరగతిలో 600 మార్కులకు గాను 560 మార్కులు సాధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలకు ఆనందాన్ని కలిగించింది. కష్టాలను లెక్కచేయకుండా లక్ష్యసాధన కోసం శ్రమిస్తే విజయాన్ని అందుకోవచ్చని హస్మిత నిరూపించిందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆమెకు అభినందనలు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >