Posted on 2026-05-14 18:44:01
పలువురు కార్మికులు మృతి..!!
డైలీ భారత్ భోపాల్: మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో ఘోర విషాదం జరిగింది. జిల్లాలో టోంక్ కాలాన్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందగానే జిల్లా ఉన్నతాధికారులతోపాటు పోలీసులు బాణాంసంచా తయారీ కర్మాగారం వద్దకు చేరుకున్నారు.
స్థానికుల సహాయంలో క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీ శబ్ధంతో ఈ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు దాటికి పరిసర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >