| Daily భారత్
Logo




బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

News

Posted on 2026-05-14 18:50:21

Share: Share


బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా 6 ప్రత్యేక చెక్‌పోస్టులు – హెల్ప్‌ లైన్ 8712686133కు సమాచారం అందించండి 

చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా,విద్వేషపూరిత పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 నిరంతరం పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పండుగ సమయంలో ఎవరైనా అనుమానాస్పద ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గమనిస్తే వెంటనే జిల్లా పోలీస్ హెల్ప్‌ లైన్ నంబర్ 8712686133 లేదా అత్యవసర సహాయం కోసం డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో 6 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, వాటిలో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. 

చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని, వాహనాలను ఆపడం లేదా తనిఖీలు నిర్వహించే అధికారం కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తులు లేదా సంస్థలు స్వయంగా తనిఖీలకు దిగడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద స్థితిగతులను గమనించినట్లయితే స్వయంకృత చర్యలకు పాల్పడకుండా, వెంటనే 8712686133 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా అత్యవసర సహాయం కోసం డయల్ 100కు  ఫోన్ చేసి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియా వేదికలపై ద్వేషపూరిత, రెచ్చగొట్టే లేదా మత సామరస్యాన్ని దెబ్బతీసే పోస్టులు, వీడియోలు ప్రచారం చేసే వారిపై పోలీసు నిఘా ఉంటుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవం, సోదరభావంతో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమాచారం అందించే వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని, ప్రజలందరూ పోలీసులతో సహకరించి జిల్లాలో శాంతిని కాపాడాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  కోరారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >