| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : బస్సు, కారు, ద్విచక్ర వాహనం ఢీ..

News

Posted on 2026-05-15 19:45:39

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : బస్సు, కారు, ద్విచక్ర వాహనం ఢీ..

గంభీరావుపేట వద్ద ఘోర ప్రమాదం...

బస్సు, కారు, ద్విచక్ర వాహనం ఢీ..

డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతిమ విజ్ఞాన విద్యా సంస్థకు చెందిన బస్సు, కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సముద్ర లింగాపూర్ శివారులో ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వాహనం నుండి బయటకు తీసి, చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో ఏటా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఫలితం శూన్యంగా కనిపిస్తోంది. అవగాహన సదస్సులు కేవలం ఫొటోలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల అమలులో అధికారుల పర్యవేక్షణ లోపించడం, వాహనదారుల్లో నిర్లక్ష్యం పెరగడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జిల్లాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత అతివేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వేగం కంటే ప్రాణం మిన్న అనే నిజాన్ని విస్మరించి, ఒక్క క్షణం చేసే నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది.

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >