Posted on 2026-05-21 18:42:11
హాస్పటల్ పై దాడులు చేయొద్దు.
సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.
డైలీ భారత్, సూర్యాపేట: హాస్పిటల్స్, హాస్పిటల్స్ సామాగ్రిని ద్వంసం చేసిన, హాస్పటల్ సిబ్బందిపై దాడులకు పాల్పడిన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు తెలిపినారు. సూర్యాపేట లో హాస్పిటల్స్ పై దాడి, సామాగ్రి డామేజ్, సిబ్బందిపై దాడులు లాంటి సంఘటనలు జరుగుతున్న సందర్భంగా సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యం వారు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపిఎస్ కి వినతి పత్రం అందజేశారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ హాస్పిటల్స్ వచ్చే రోగులకు, ప్రజలకు విలువైన వైద్య సేవలు అందించాలని ఐఎంఏ డాక్టర్లకు సూచించారు, ప్రజల నమ్మకం చూరగొనే విధంగా వైద్యం చేయాలని తెలిపినారు. నాణ్యమైన పరికరాలు నైపుణ్యం ఉన్న సిబ్బందిని హాస్పిటల్స్ నందు నియమించాలని తెలిపినారు.
ప్రైవేట్ ఆస్పత్రి నందు వైద్య నిమిత్తం వచ్చిన ప్రజలు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆసుపత్రి యాజమాన్యాలను ఆసుపత్రులను లక్ష్యంగా దాడులు లాంటివి చేయకూడదని, సామాగ్రిని ధ్వంసం చేయడం సిబ్బందిని గాయపరచడం లాంటివి చేయకూడదు అని తెలిపారు ఇలాంటివి చట్టపరంగా నేరమని అన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు, సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలు వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ వైద్యశాల నందు నాణ్యమైన వైద్యం అందుతుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వినతి పత్రం అందజేసిన దానిలో సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ దాంగ్డే, జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ అనూష, డాక్టర్ సుప్రజ, డాక్టర్ శ్రీరామ్ ఉన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >