| Daily భారత్
Logo




వార్షిక తనిఖీల్లో భాగంగా లింగంపేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

News

Posted on 2026-05-23 19:51:54

Share: Share


వార్షిక తనిఖీల్లో భాగంగా లింగంపేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ ప్రజలకు నమ్మకం కలిగించేలా పోలీసింగ్ ఉండాలి.

విజిబుల్ పోలీసింగ్‌తో శాంతిభద్రతలు మరింత బలోపేతం చేయాలి.

పాత నేరస్తులు, సస్పెక్ట్ ప్రతి కదలికపై గట్టి నిఘా ఉంచాలి.. ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి.

రాబోయే బక్రీద్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు సూచనలు.

ప్రతి పిటిషన్‌ను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలి.

జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు లింగంపేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ రాజిరెడ్డి, ఎస్ఐ దీపక్ కుమార్ పూలమొక్కలు అందించి ఎస్పీ గారికి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ  పోలీసుల గౌరవ వందనం స్వీకరించి యూనిఫాం టర్నౌట్‌ను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణ, క్రమశిక్షణ, ప్రజాసేవలపై పలు అంశాలను సమీక్షించారు. అధికారులకు సూచించిన విషయాలు సిబ్బందికి పూర్తిగా అవగాహన ఉందా లేదా అన్నది స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

తదుపరి పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారెక్స్, టెక్నికల్ రూం, స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు విధానం, సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్ భౌగోళిక మ్యాప్, క్రైమ్ హాట్‌స్పాట్స్ తదితర అంశాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై ఎస్ఐ దీపక్ కుమార్‌ను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

అలాగే పోలీస్ స్టేషన్‌లో కేసుల నమోదు విధానం, ఆన్లైన్ CCTNS వ్యవస్థ పనితీరు, ఫిర్యాదుదారులను స్వీకరించే విధానం తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రిజిస్టర్లను చెక్ చేయడం జరిగింది ప్రతి పిటిషన్‌ను తప్పనిసరిగా ఆన్లైన్‌లో నమోదు చేయాలని, ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శక సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.....

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకొని చట్టప్రకారం తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందించే విధంగా పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించాలని సూచించారు. ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్ తమకు కేటాయించిన గ్రామాన్ని నిరంతరం సందర్శిస్తూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై ప్రమాద హాట్‌స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దొంగతనాల నివారణకు ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, కేసుల డిటెక్షన్ వేగవంతం చేయాలని సూచించారు. 

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించడంతో పాటు అక్రమ గోవుల రవాణాను అడ్డుకోవాలని అధికారులకు ఆదేశించారు.

లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ (Good Work) కనబరిచిన హోం గార్డ్ లక్ష్మణ్‌ను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేశారు. అనంతరం స్టేషన్ అధికారుల పనితీరును అభినందిస్తూ, నేరాల నియంత్రణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి.యస్.శ్రీనివాస్ రావు  గారు, యెల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి,లింగంపేట  ఎస్‌హెచ్‌ఓ దీపక్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >