Posted on 2026-06-04 18:50:58
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదును గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు (MEOs), కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రవేశాల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో విద్యార్థుల నమోదు కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రవేశాల ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
టెలి కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ NV గిరి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >