| Daily భారత్
Logo




నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

News

Posted on 2026-06-20 19:09:02

Share: Share


నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్ : ఆదివారం జరగనున్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను  పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నాగారంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ప్రశ్న పత్రాలను తరలించే రూట్ మ్యాప్ ను సైతం స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అభ్యర్థులను లోనికి అనుమతించాలని, అభ్యర్థులతో పాటు సిబ్బంది కూడా ఏ ఒక్కరూ సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకూడదని అన్నారు.

   కాగా, విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల్లోని ఆయా గదుల వివరాలను తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతితో పాటు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎం లను నియమించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం అవకాశం లేకుండా నీట్ ప్రవేశ పరీక్షను పక్కాగా నిర్వహించాలని, సీ.సీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.15 గంటల వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >