| Daily భారత్
Logo




పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

News

Posted on 2026-06-25 12:45:33

Share: Share


పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

ముదినేపల్లి పోలీసుల వలలో మ్యాట్రిమోనియల్ సైట్ మోసగాడు

డైలీ భారత్, ముదినేపల్లి: మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా వివాహం పేరుతో మహిళలను మోసం చేసి నగదు, బంగారం కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు వక్కలగడ్డ సాంబశివరావును అరెస్ట్ చేశారు.

నిందితుడు తాను ప్రముఖ మీడియా సంస్థలో CEOగా పనిచేస్తున్నానని, కుటుంబం ఉన్నత స్థాయిలో ఉందని అబద్ధాలు చెబుతూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మహిళలకు పరిచయమయ్యేవాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి, ప్రేమ మరియు పెళ్లి పేరుతో మహిళల నుంచి నగదు, బంగారం తీసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 మందికిపైగా మహిళలను మోసం చేసినట్లు గుర్తించారు.

ఈ కేసు ఛేదనలో కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్, ముదినేపల్లి ఎస్‌ఐ వి.ఎస్.వి. భద్రరావు, హెడ్ కానిస్టేబుళ్లు బి. పెద్దిరాజు, పి.వి. సత్యనారాయణ, పోలీస్ కానిస్టేబుళ్లు బి. నాగబాబు, పి. పవన్ కుమార్, హోంగార్డ్ జి. శివ కోటయ్య కీలక పాత్ర పోషించారు. వారి ఉత్తమ సేవలను ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS అభినందించారు.


#EluruPolice #MudinepalliPolice #CrimeDetection #MatrimonialFraud #CyberAwareness #WomenSafety #SPPratapShivaKishoreIPS #AndhraPradeshPolice #StayAlertStaySafe #EluruDistrictPolice

Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >
Image 1

పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

Posted On 2026-06-25 12:45:33

Readmore >
Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >
Image 1

మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు

Posted On 2026-06-25 12:21:26

Readmore >
Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >