| Daily భారత్
Logo




సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

News

Posted on 2026-07-04 16:57:14

Share: Share


సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ధ్యేయం.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.

చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఆద్వర్యంలో రూ.200 కోట్ల నిధులతో వైఐఐఆర్ఎస్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రభుత్వ విప్, శంకుస్థాపన.

డైలీ భారత్, చందుర్తి : సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.

చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఆద్వర్యంలో రూ.200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (వైఐఐఆర్ఎస్) నిర్మాణానికి శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిలుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడ నియోజకవర్గనికి ఒక మణిహారంగా నిలుస్తుందని తెలిపారు. త్వరలోనే చందుర్తి -మోత్కూరావు పేట రోడ్డుకు భూమి పూజ చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా విధానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

సమూల మార్పులు చేస్తున్నారని వివరించారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచారని గుర్తు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందజేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లో 2600 మంది విద్యార్థులు చదువుతారని, భవన నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన వారి సహకారం మరువలేనిదని కొనియాడారు. ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రుద్రంగిలో 10 ఎకరాల్లో రూ.46 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఆరు కోర్సులు.. 200 పైగా విద్యార్థులు శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. మండేపల్లిలో ఇప్పటికే కొనసాగుతుందని వివరించారు. 

హైదారాబాద్, డిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇటీవల ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారని వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో వసతులు, విద్యా బోధనపై తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. త్వరలో వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. భీమారం, మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు సాగు నీరు అందించే ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మధ్య మానేరు ముంపు గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటారని పేర్కొన్నారు. జిల్లా గత యాసంగి సీజన్ కంటే ఈ ఏడాది దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఎక్కువ చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మర్రిపల్లిలో 40 ఎకరాల స్థలంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయనున్నామని, దీంతో రైతులకు భూసార పరీక్షలు చేసేందుకు ఉపయోగపడుతుందని, విత్తనాలు ఇతర సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రాజన్న ఆలయాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఆగమ శాస్త్రం ప్రకారం శృంగేరి పీఠాధిపతుల సూచనలతో అభివృద్ధి విస్తరణ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే 40 ఎకరాల్లో అత్యాధునిక గోశాల నిర్మాణం చేయనున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను అభివృద్ధి పనులు చేయిస్తున్నారని తెలిపారు. ప్రధాన రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో నేతన్నలకు కోటి ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. రూ. 300 కోట్ల బకాయిల విడుదల చేశామని గుర్తు చేశారు. 

వేములవాడ మూల వాగుపై బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతు న్నాయని తెలిపారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (హ్యామ్) కింద వేములవాడ - సిరికొండ మార్గం, ఇతర చోట్ల రోడ్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. మధ్య మానేరు ముంపు గ్రామాల వాసుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడానని గుర్తు చేశారు. జిల్లాలో నూతన గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు స్థలాలు గుర్తిస్తున్నారని తెలిపారు. రూ. 1000 కోట్ల నిధులతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో చేయిస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని, జిల్లా పురోగతిలో భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలువు నిచ్చారు. 

అన్ని వసతులతో విద్యాలయం ..

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వేములవాడ నియోజకవర్గంలో అన్ని వసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర దేశాలు, ప్రాంతాల్లో అధ్యయనం చేయించారని పేర్కొన్నారు. మూడపల్లిలో అనువుగా ఉన్న స్థలాన్ని స్కూల్ కోసం కేటాయించామని వెల్లడించారు. వేములవాడకు దగ్గరలో ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సౌకర్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ప్రత్యేక వసతి గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్ లు, అత్యాధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే కామన్ మెనూ ప్రకారం ప్రకటించారని, ప్రతి వారం చికెన్, మటన్, ఇతర ఆహార పదార్థాలను పక్కాగా అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేసి . భోజనం, వసతులు పరిశీలించి.. వారితో కలిసి భోజనం చేసి నివేదిక ఇస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో 61 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభం అయ్యాయని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ వసతులు సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మంచి ఉద్యోగాలు, తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. 

టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎండీ గణపతి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయగా, 60 చోట్ల పనులు మొదలు అయ్యాయని తెలిపారు. జిల్లాలో దాదాపు 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి, టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎస్ఈ రవీందర్, ఈఈ అశోక్ కుమార్, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, తహసిల్దార్ భూపతి, ఏఈ శ్రీకాంత్, సర్పంచ్ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >