Posted on 2026-07-03 18:35:18
ఖమ్మం ఎండోమెంట్ సహాయ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన మదిశెట్టి సామేలు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్‌ను కలిసి 34 మండలాలకు చెందిన గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషన్ మరియు ఎండోమెంట్ శాఖ జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారుఅదేవిధంగా దీప–ధూప–నైవేద్య పథకం కింద ప్రతి గిరిజన శివశక్తుల పూజారికి ప్రతి నెల రూ.10,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని, ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఆలయాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కోరారు.
గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న శివశక్తుల పూజారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు, వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డా. మద్దిశెట్టి సామేలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పుట్టబంతి హరిబాబు, బానోతు శీను నాయక్, కొట్టే కృష్ణ, మచ్చ గిరి, కామేపల్లి నుండి సురేష్ నాయక్, అశోక్ నాయక్, కుసుమంచి మండలం నుండి మధుకర్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొని గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >