| Daily భారత్
Logo




ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

News

Posted on 2026-07-04 07:18:45

Share: Share


ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

డైలీ భారత్, తిరుపతి: ప్రభుత్వ రుణం మంజూరు పేరుతో లంచం డిమాండ్ చేసిన తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్యను ఏపీ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

చేపల పెంపకం కోసం ఒక రైతుకు రూ.50 లక్షల రుణం మంజూరైంది. ఆ రుణం ఫైల్ క్లియర్ చేయడానికి డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రూ.6 లక్షలు లంచం అడిగాడు. దీంతో బాధిత రైతు ACBకి ఫిర్యాదు చేశాడు.

ACB అధికారులు ఫిర్యాదు ధృవీకరించి ట్రాప్ ప్లాన్ చేశారు. రూ.6 లక్షల్లో మొదటి విడతగా రూ.3 లక్షలు తీసుకుంటుండగా రెడ్డయ్యను అధికారులు పట్టుకున్నారు. 

అధికారిని అదుపులోకి తీసుకున్న ACB సిబ్బంది అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని తదుపరి విచారణ కోసం SPE & ACB స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు.

ప్రభుత్వ పథకాలు, రుణాలు, సబ్సిడీల పేరుతో ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 ACB టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ACB అధికారులు సూచించారు.

కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >