Posted on 2026-07-11 14:10:21
కృతజ్ఞతాభావానికి... హరీష్ ఫిదా...!!
రోహిత్ ఉదారత కు... హరీష్ ఉద్వేగం...
హరీష్ రావు ప్రజా సేవకు యువ ఉద్యోగి ఉడుత సాయం....
ఎమ్మెల్యే హరీష్ రావును కలిసి రూ 6లక్షల విరాళం
ఇంజనీరింగ్ సిటు ఇప్పిచ్చినందుకు కృతజ్ఞతభావం..
రోహిత్ నేటితర యువ ఉద్యోగులకు స్ఫూర్తి దాయకం.. రోహిత్ ఉదారతను మెచ్చుకున్న హరీష్ రావు..
యువ ఉద్యోగి రోహిత్ ను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
డైలీ భారత్ డెస్క్: సహాయం పొంది మరిచే ఈరోజుల్లో.. నాకు ఇంజనీరింగ్ సిటు ఇప్పించావు.. అందుకు నేను మీ ప్రజా సేవలో మీకు తోడువుతా అంటూ రోహిత్ కలసిన సందర్బం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ని ఒక్క సారే ఉద్వేగాన్ని ఇచ్చింది...ఉన్నత చదువుల కోసం తాపత్రయ పడిన యువకుడికి ఇంజనీరింగ్ సిటు ఇప్పిచ్చినందుకు కృతజ్ఞత భావంతో తన మొదటి సంవత్సర ప్యాకేజి లో సగభాగం హరీష్ అన్నకే... సిద్దిపేట సేవా కార్యక్రమాలకు ఉడుత సాయం గా అందించాడు.. రోహిత్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి..సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత కుమారుడు రోహిత్ కు విఎన్ఆర్ (విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ కళాశాల లో కంప్యూటర్ సైన్స్ లో సిటు కావాలని గతం లో హరీష్ రావు గారిని కలసి కోరడం తో నాడు తాను ఒక్క ఫోన్ తో సిటు వచ్చింది.. సిటు ఇప్పించడంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సహాయం ను రోహిత్ గుర్తుంచుకొని ఇంజనీరింగ్ పూర్తి అనంతరం రిగల్ రెక్స్లర్డ్(అమెరికా బహుళ జాతి సంస్థ)లో రోహిత్ ఉద్యోగం సాధించాడు. వార్షిక వేతనం రూ 12లక్షలు. దింతో తన చదువు కోసం సహాయాన్ని గుర్తు పెట్టుకొని మాజీ మంత్రి హరీష్ రావు మీద ఉన్న ప్రేమ కృతజ్ఞతభావంతో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిసి తన వార్షిక వేతనం లో సగం రూ 6లక్షలను మీకు... సమాజ సేవ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని విరాళం గా అందించారు. హరీష్ రావు సిద్దిపేట ప్రజల కోసం చేస్తున్నసామాజిక సేవ లో భాగంగా ఉడతా సాయంగా నిలిచి భాగస్వామ్యం కావాలని తన ఆకాంక్ష అని రోహిత్ పేర్కొన్నారు. రోహిత్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం తో హరీష్ రావు ఉద్వేగ భరితుడు అయ్యాడు.. యువ ఉద్యోగి రోహిత్ ఉదారత్వ స్వభావాన్ని మెచ్చుకున్నాడు నెటి తర ఉద్యోగులకు ఆదర్శమని,, స్ఫూర్తిదాయకమని, ఆయనను హరీష్ రావు సన్మానించి అభినందించారు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ
Posted On 2026-07-11 13:44:17
Readmore >