| Daily భారత్
Logo




జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

News

Posted on 2026-07-11 15:49:13

Share: Share


జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం

జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ

డైలీ భారత్, కామారెడ్డి : విశ్వసనీయ సమాచారం మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్కల్ గ్రామంలో ఈరోజు బిచ్కుంద ఎస్‌ఐ రాజు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లాలో జూదం, పేకాట, బెట్టింగ్, అక్రమ మద్యం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

"జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాకుండా, కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిని దెబ్బతీసి, సమాజంలో నేరాల పెరుగుదలకు దారితీస్తాయి" అని జిల్లా ఎస్పీ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబ కలహాలు, సామాజిక సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు.

జూదానికి బానిసై నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని, కష్టపడి సంపాదించే సరైన మార్గాన్ని ఎంచుకొని మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని జిల్లా ఎస్పీ సూచించారు.

జూదం, బెట్టింగ్ లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >