Posted on 2026-07-11 17:25:49
డైలీ భారత్ డెస్క్: దిగ్గజ సింగర్ ఎస్.జానకి(88) తుదిశ్వాస విడిచారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న జానకి.. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగర్ జానకి మనవరాలు ఇన్‌స్టా పోస్ట్‌తో ఈ విషయాన్ని తెలియజేశారు. తమకు ఎంతో ఇష్టమైన గాయని శివైక్యం చెందడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.ఎస్ జానకి పూర్తి పేరు శిష్టా జానకి. ఏప్రిల్ 23, 1938 గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, శకుంతలమ్మ. భర్త వి. రామ్‌ప్రసాద్ 1992లో మరణించారు. వీరికి మురళీకృష్ణ అనే ఒక కుమారుడు ఉన్నారు. 1957లో విడుదలైన "విధియిన్ విలయాడల్" అనే తమిళ చిత్రం ద్వారా ఆమె గాయనిగా పరిచయమయ్యారు. తెలుగులో ఆమె మొదటి పాట "ఎమ్మెల్యే" (1957) చిత్రంలోని "నీ ఆశ అడియాస పాయెనే మోసమాయెనే". తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17కు పైగా భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో దాదాపు 48,000 కంటే ఎక్కువ పాటలను ఆలపించారు.
ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు (16 వయతినిలే - తమిళం, శంకరాభరణం - తెలుగు, ఏరి పీలక్కూ ఒరు కూడు - మలయాళం, సీతకోకచిలుక - తెలుగు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 కి పైగా నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుండి 14 సార్లు, తమిళనాడు ప్రభుత్వం నుండి 7 సార్లు రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 2013 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన "పద్మభూషణ్" అవార్డును ఆమె తిరస్కరించారు. దశాబ్దాల సేవకు గానూ తనకు చాలా ఆలస్యంగా ఈ అవార్డు ఇచ్చారని, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె నిరసన వ్యక్తం చేశారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >