| Daily భారత్
Logo




వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-08-15 07:51:52

Share: Share


వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, రామంతపూర్:వెంకట సాయి నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, దేశభక్తి వాతావరణంలో నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కాలనీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఒకే కుటుంబంలా కాలనీ ప్రజలందరూ కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, పోలీసు సిబ్బంది, ప్రజాసేవకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, దేశ సమగ్రతను కాపాడుతూ బాధ్యతాయుతమైన పౌరులుగా ముందుకు సాగాలని కోరారు. అనంతరం కాలనీ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు రమేష్ గౌడ్, ఎం. రవికుమార్, గోపాల్ యాదవ్, సర్వ సత్తయ్య యాదవ్, శివ శంకర్, సంజీవ్, కమిటీ సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, శ్రీనివాస్ గౌడ్, కే. నవీన్ కుమార్, భూపతి రాములు గౌడ్, డాక్టర్ విద్యాసాగర్, రామకృష్ణ, శివకుమార్, బి. చలపతిరావు, రమేష్ శెట్టి, స్వామి, మాసయ్య, వేణుగోపాల్ రెడ్డి, హరీష్, శేఖర్, సాయికుమార్, ఆంజనేయులు, చంద్రం చారి, సిద్ధు గౌడ్, గణేష్, బాల కొమరయ్య, వెంకట స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఐకమత్యమే కాలనీ బలం.. రాజ్యాంగ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చిన విజయేందర్ రెడ్డి

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >