Posted on 2026-08-15 16:53:32
డైలీ భారత్, కొత్తగూడెం: ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్య ఫలాలు లభించాయని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్త, మాజీ వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం అనేక రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్యంతో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానంలో ఉందని, 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. స్వాతంత్రం వచ్చిందని సభలు చేసి సంబరపడిపోగానే సరిపోదు సాధించిన దానికి సంతృప్తి చెంది అది విజయం అనుకుంటే సరిపోదు అంటూ గేయాన్ని అయన వినిపించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంబరాలు చేసుకోవడంతోనే బాధ్యత పూర్తికాదని తెలిపారు. దేశం మనకు ఏమిచ్చిందన్నదానికంటే.. దేశానికి మనం ఏమిచ్చామనే విషయాన్ని ప్రతి పౌరుడు ఆలోచించాలని సూచించారు. రాజకీయ ప్రతినిధిగా, దేశ పౌరుడిగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అన్నది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
మౌలిక వసతుల కల్పనపై దృష్టి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో మౌలిక వసతుల కల్పనలో కొంత వెనుకబడి ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లాలో అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అన్ని ఎన్నికల్లో పోటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. రానున్న అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి తన సత్తా చాటుతుందని అన్నారు. సెప్టెంబరులో ఖమ్మంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >