| Daily భారత్
Logo




మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

News

Posted on 2026-08-15 16:54:31

Share: Share


మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

డైలీ భారత్, కొత్తగూడెం: డాక్టర్‌ జి.ఎస్.ఆర్. చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సులను పంపిణీ చేశారు. ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.

సుజాతనగర్‌ మండలం సింగభూపాలెం, పాల్వంచ మండలం కోడిపుంజులవాగు గ్రామపంచాయతీలతోపాటు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆర్‌సీఎం చర్చికి ఒక్కొక్క ఫ్రీజర్‌ బాక్సును అందజేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు అవసరమైనప్పుడు వీటిని ఉచితంగా వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే లక్ష్యంతో జి.ఎస్.ఆర్. చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఆరేళ్లుగా మహిళలు, నిరుద్యోగ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణతోపాటు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ఇబ్బందులు లేకుండా ఫ్రీజర్‌ బాక్సులను అందిస్తున్నట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా మానవత్వంతో సేవ చేయడమే ట్రస్ట్‌ లక్ష్యమన్నారు.

కొత్తగూడెం నియోజకవర్గంలోని పేదలకు విద్య, వైద్య రంగాల్లో సహకారం అందిస్తామని తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో మొబైల్‌ వైద్య సేవలను ప్రారంభించి, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు, నిరుపేద కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు రాము యాదవ్‌, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మిర్యాల రామకృష్ణ, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి నరేష్‌, కొత్తగూడెం నాయకుడు శ్యామ్‌ జోగారావు, ట్రస్ట్‌ మేనేజర్‌ అంజి, సింగభూపాలెం సర్పంచి కిన్నెర వెంకన్న, కోడిపుంజుల వాగు సర్పంచి మహేశ్వరి, మహేష్ ఆర్.సి.యం ఫాదర్ బాలస్వామి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >