Posted on 2024-02-25 17:37:41
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు సంపూర్ణ అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తుందని ఇందులో భాగంగా ఈ నెల 27 వ తారీఖున చేవెళ్ల లో ఫరహ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకా గాంధీ గారి చేతుల మీదుగా మహిళ లకు 500 లకే గ్యాస్ సిలిండర్, మరియు గృహజ్యోతి పథకాలను ప్రారంభించ నున్నట్లు ఆదివారం నాడు చేవెళ్ల లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో చేవెళ్ల కాంగ్రెస్ భీమ్ భరత్ తెలిపారు, అందుకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజక వర్గ స్థాయి కార్య కర్తల, నాయకుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,వికారాబాద్ జెడ్పి ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి , పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేర్చే దిశగా చిత్తశుద్దితో ముందుకు సాగుతుందని వారు తెలిపారు. అత్యంత ప్రతిస్టా త్మకంగా ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి చేవెళ్ళ ను వేదికగా ఎంచుకున్నందుకు రాష్ట్ర నాయకత్వానికి, ప్రభుత్వ పెద్దలకు భీమ్ భరత్ క్రుతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతి స్టా తమకంగా తీసుకొని విజయవంతం చెయ్యాల్సిన బాధ్యతను తాము సంతోషంగా స్వీకరిస్తున్నారు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు, అభిమానులు నిత్యం సమన్వయం తో పనిచేయాలని పిలుపు నిచ్చారు.
ఇదే కృషిని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధిని ప్రజల్లో కి తీసుకెళ్ళి రానున్న పార్లమెంట్ ఎన్ని కల్లో చేవెళ్ల నియోజక వర్గంలో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >