Posted on 2024-07-15 20:13:52
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వలస కడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాపాలనలో భాగంగా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ చేరారు.
మహిపాల్‌రెడ్డి 2014 నుంచి వరుసగా మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత కొద్దిరోజులుగా మహిపాల్ రెడ్డి చేరిక వాయిదా పడుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన చేరాల్సి ఉన్నా పార్టీ నేతల అభ్యంతరంతో వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్‌లో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, కాలేరు యాదయ్య, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, సంజయ్, కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >