| Daily భారత్
Logo




రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-20 16:52:36

Share: Share


రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కొందుర్గు మండలంలో రైతు రుణమాఫీ సంబరాలు

సంబరాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షాలు అనే విధంగా అనుకున్న సమయంలో కన్నా ముందే రైతులు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం ఎంతో సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్, మైనార్టీ యువ నాయకుడు అక్రమ్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి తదితర మాజీ ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ శ్రేణులు తదితరులు భారీ ఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల కోసం సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించడం జరిగిందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పినట్లుగానే నేడు రుణ మాఫీ చేశారన్నారు. రైతు బాంధవుడు, రైతు సమస్యలు ఎరిగిన వాడు.. రైతు కష్టాలను దగ్గరుండి చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సంబందించిన పంట రుణాలను అది కూడా ఏకకాలంలో రూ.2లక్షల రుణ మాఫీ చేసి రైతు బాంధవుడిగా మారిన నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కరేనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే కొన్నీ గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. ప్రతి రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ముందుగా రూ.లక్ష వరకు రుణ మాపీ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు వరకు 1.5 లక్షలు, ఆగస్టు 15 నాటికి మొత్తం 2 లక్షల రుణ మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రుణ మాఫీ చేసిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవవంత్ రెడ్డిలకు రాష్ట్ర ప్రజలంతా రుణ పడి ఉంటారని అన్నారు..

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >