| Daily భారత్
Logo




అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారు

News

Posted on 2024-07-20 18:29:32

Share: Share


అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారు

ముత్తారంలో ఇంట్లో చంపి గొనసంచిలో మూటకట్టి బావిలో వేశారు

హత్యలో పాల్గొన్న ముగ్గురు అరెస్ట్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో గత నెల 8వ తేదీన బావిలో మూటలో దొరికిన మహిళ  అప్పు అడిగినందుకే మహిళను హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ లో శనివారం సమావేశంలో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్ఐ మధుసూధన్ రావులతో కలిసి నిందితుల వివరాలను తెలిపారు. ఈ నెల 5వ తేదీన ముత్తారంకు చెందిన అమ్ము రజీత అలియస్ లావాణ్య తన ఇంటి సమీపంలో ని పెరక రాజేశ్వరి (65) వద్ద అప్పు లక్ష 50 వేలు అప్పు తీసుకుందని, రాజేశ్వరి తరుచూ అప్పుడబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఆగ్రహంతో 8వ తేదీన అప్పు ఇస్తానని రాజేశ్వరిని ఇంటికి పిలిచిన లావణ్య మరో వ్యక్తి కుక్కముడి తిరుపతితో పాటు భర్త రవి అలియాస్ రమేష్ తో కలిసి ఇంట్లో గొంతు నులిమి చంపి అదే రాత్రి గొనసంచిలో మూటకట్టి బావిలో పారుపల్లికి వేళ్లే వ్యవసాయ బావిలో వేశారన్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురిని శనివారం ఉదయం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధుసూధన్ రావు లు అరెస్ట్ చేశారని తెలిపారు. అప్పు ఇచ్చిన రాజేశ్వరి తమను తరచుగా డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెట్టేదని, అందుకే ఆమెను హత్య చేసి రాజేశ్వరి ఒంటి పై ఉన్న బంగారం తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చమన్నారు. హత్య చేసిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్ఐ లతో పాటు కానిస్టేబుల్స్ దుబాసి రమేష్, బాలగాని కిరణ్ లను ఏసీపీ అభినందించారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >