| Daily భారత్
Logo




పద్మశాలి ఆత్మగౌరవ సభ విజయవంతం

News

Posted on 2023-11-02 18:10:24

Share: Share


పద్మశాలి ఆత్మగౌరవ సభ విజయవంతం

డైలీ భారత్ సిరిసిల్ల :గురువారం జిల్లా కేంద్రంలోని లహరి గ్రాండ్ కళ్యాణ మండపంలో హిందూ సాంస్కృతిక సమితి జిల్లా అధ్యక్షుడు పత్తిపాక సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మ గౌరవ సభలో చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు. జై పద్మశాలి...జై మార్కండేయ అనే నినాదాలతో  సభ దద్దరిల్లింది. ఈ సందర్భంగా వీర మోహన్ మాట్లాడుతూ మార్పు నాంది ప్రస్తావన చేస్తూ ఒక యువకుడు ఎమ్మెల్యే పోటీకి రావడం సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్లలో ఎన్నడూ కూడా పద్మశాలి కకు నాయకత్వం లేదనీ, స్థానికుడు కాని కేటీఆర్ తమ ఓట్లతో గెలిచి తమపై అధికారం సాగిస్తున్నారన్నారు. సిరిసిల్లలో అత్యధికంగా ఉన్న పద్మశాలిలకు బిఆర్ఎస్ టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పద్మశాలిలకు రాష్ట్రంలో ఎక్కడ కూడా టికెట్టు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఇకపై వారి ఆటలు సాగవన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఐదు ఎండ్లు కలెక్టరేట్ లో పెట్టీ ఎన్నికల ముందు ప్రారంభించారు విమర్శించారు. నేతన్నలకు సిరిసిల్లలో అనేక సమస్యలు ఉన్నాయని, బతుకమ్మ చీరల పేరుతో నేతన్నల బతుకులు కేటీఆర్ ఆగం చేసిండని మండిపడ్డారు. ఈసారి మార్పును కోరుకుంటున్నారనీ, తమ సామాజిక వర్గాన్ని తామే ఎలుకోవాలని ముందుకు వచ్చిన సురేష్ ను సిరిసిల్లలో గెలిపించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ పద్మశాలి వర్గానికి చెందిన వారు పోటీలో ఉన్న వారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

హిందూ సాంస్కృతిక సమితి జిల్లా అధ్యక్షుడు పత్తిపాక సురేష్ మాట్లాడుతూ... 

 ఏడున్నర దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రాంతాన్ని పరాయివాల్లు ఏలుతున్నరని, చుట్టపొన్ని కాదు ఇంటి మనిషిని ఆదరించాలన్నారు. నాయకుడు మనొడైతే చెందాలు అడుక్కునే అవసరం ఉండదన్నారు. కేటీఆర్ కు అవకాశం మనమే ఇచ్చామని, ఇప్పుడు అధికారం మనకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కేటీఆర్ కు సద్ది కూడా మనమే పెట్టి పోషించామని, కానీ ఇప్పుడు సిరిసిల్ల నేలతల్లి బాధపడుతుందన్నారు. స్వరాష్ట్రంలో పారాయోడు పాలిస్తున్నాడని, సిరిసిల్ల నేతన్నల కుటుంబాల్లో చావు కార్యక్రమాలు చేయడానికి కూడా సౌకర్యాలు లేవని, మనోడు నాయకుడు అయితే అన్ని సమస్యలు తిరుతాయన్నారు. తనది వయసు చిన్నదైన అనుభవం పెద్దదను, తమ ఓట్లు తామే వేసుకుంటే గేస్తుస్తామని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లకు ఏం చేయకపోతే నేనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వ్యవస్థాపకులు వాసల లక్ష్మీనారాయణ, రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు వేదాశ్రీ, కౌన్సిలర్ పద్మ, బిసి సంఘం రాపెళ్ళి ఆనందం, ఆర్ఎంపి,పి.ఎం.పి అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి రాజమల్లు, పద్మశాలి నేతలు రాపల్లి ముకుందం, గుడ్ల విష్ణుతో పాటు పెద్దయెత్తున పద్మశాలిలు పాల్గొన్నారు.

Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >