Posted on 2023-11-05 00:27:58
ఎక్కడికి ఆంటీ అన్నాడు.. బుక్కయ్యాడు.. కండక్టర్‌పై కేసు నమోదు.
డైలీ భారత్ న్యూస్: ఎవరైనా సరే.. ఇతరుల్ని పలకరించేటప్పుడు అండీ అనే పదాన్ని చివర చేరుస్తారు. తద్వారా వారిని గౌరవిస్తూ సంభాషించినట్లు అవుతుంది. ఈ కేసులో కండక్టర్..ప్రయాణికులతో సంభాషించాలంటే.. ఎక్కడికి వెళ్లాలండీ అని లేదా.. ఎక్కడికి టికెట్ కావాలి అని అడగొచ్చు.. లేదా ఎక్కడికి ఇవ్వాలి? అని అడగొచ్చు.. కానీ ఆ కండక్టర్.. ఆంటీ అని పిలవడం సమస్య అయ్యింది.
తమిళనాడు.. చెన్నైలో ఇది జరిగింది. వాషర్‌మెన్‌పేటకు చెందిన 57 ఏళ్ల నిర్మలాదేవి.. బుధవారం చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) బస్సులో మింట్ నుంచి రెడ్‌హిల్స్‌కి ప్రయాణించారు. ఆ బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కార్తీక్... ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ అని అడిగారు. అంతే.. అల్లకల్లోలం అయిపోయింది.
నన్ను ఆంటీ అంటారేంటి? అని ఆమె ప్రశ్నించింది. అప్పుడైనా కార్తీక్.. తన తీరు మార్చుకుంటే బాగుండేదే.. కానీ అతను మళ్లీ అలాగే ఆంటీ అని సంబోధించాడు. దాంతో ఆమెకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. తన భర్తకు కాల్ చేసింది. ఏం కాదులే అని కార్తీక్ అనుకున్నారు. ఐతే.. ఆమె బస్సు దిగుతూ.. అక్కడున్న భర్తతో కలిసి.. రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది.
తనను ఆంటీ అని పిలిచి అవమానించారని.. కండక్టర్‌పై ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు రాసిన పోలీసులు.. విచారిస్తామని చెప్పారు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు చెబుతుంటారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >