| Daily భారత్
Logo




ఉద్యోగ,ఉపాధ్యాయులకు డిసెంబర్ 1న సెలవు ప్రకటించాలి :TTU జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి

News

Posted on 2023-11-08 12:34:11

Share: Share


ఉద్యోగ,ఉపాధ్యాయులకు డిసెంబర్ 1న సెలవు ప్రకటించాలి :TTU జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి

TTU జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి

డైలీ భారత్, సిరిసిల్ల: నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధులు నిర్వహించుచున్న ఉద్యోగ,ఉపాధ్యాయులకు మరుసటి రోజు డిసెంబర్ 1వ తేదీన సెలవు ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయులు నవంబర్ 29,30 తేదీల్లో ఎన్నికల విధులు నిర్వహించే నేపద్యంలో మానసిక, శారీరక అలసటకు గురి అవుతారని, ఎన్నికల విధులలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు అందరికి డిసెంబర్ ఒకటవ తేదీన సెలవు ప్రకటించాల్సిన అవసరంవుందని అన్నారు. ఉద్యోగులు 30వ తేదీ న రాత్రి 1,2గంటలకు ఇంటికి చేరే పరిస్థితి దరిమిలా తెల్లారి డ్యూటీ చేయడం కష్టతరం అవుతుందని అన్నారు. ఎన్నికల విధులు ఎంతో బాధ్యత యుతంగా నిర్వహించాల్సి ఉంటుందని అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించాలని, రెమ్యూనేషన్ సకాలంలో అందించాలని కోరారు..త్రాగు నీరు, భోజనాలు తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ లు పాల్గొన్నారు

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >