| Daily భారత్
Logo




సిరిసిల్ల లో మున్సిపల్ వైస్ చైర్మన్ అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

News

Posted on 2024-09-05 17:02:25

Share: Share


సిరిసిల్ల లో మున్సిపల్ వైస్ చైర్మన్ అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ కు చెందిన బిల్డింగ్ సెల్లార్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్, మంచె శ్రీనివాస్ కు  సంబందించిన బిల్డింగ్ సెల్లార్ ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గోపాల్ నగర్ లో వైస్ ఛైర్మన్ కు కల తన బిల్డింగ్ లో, నిబందనలకు విరుద్దంగా అక్రమంగా సెల్లార్ లో కమర్షియల్ షెట్టర్ లు వేశాడు. అంతేకాకుండా, ప్రక్క ఇంటి గోడను ఆనుకుని, అక్రమంగా టాయిలెట్ లు కట్టారు. ఈ విషయం పై ఆ ఇంటి యజమానితో పాటు మరో స్థానికుడు పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు ఇరువురూ, వేరు వేరుగా గౌరవ హైకోర్ట్ ను ఆశ్రయించారు. గౌరవ హైకోర్ట్ అక్రమంగా నిర్మించిన వాటిపై చర్యలు చేపట్టాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దిగివచ్చిన మున్సిపల్ అధికారులు సెల్లార్ మెట్లను, షట్టర్ లను తొలగించారు. దీనిపై ఇంచార్జ్ కమీషనర్ మాట్లాడుతూ......  హైకోర్ట్ ఉత్తర్వుల మేరకు యజమానికి నోటీసులు ఇచ్చామని, అతని నుండి సరైన సమాధానం రాకపోవడంతో, చట్ట ప్రకారం పార్కింగ్ కోసం  సెల్లార్ ను పడగట్టామని ఆయన వెల్లడించారు. మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలపై పిర్యాదు దారుడు స్పందిస్తూ . . . అధికారులు తూ... తూ... మంత్రంగా పడగొట్టి మమ అనిపించారని ఆరోపించాడు. బిల్డింగ్ మెట్లు పార్కింగ్ స్థలంపై ఉన్న మెట్లు, రహదారిపైన పెట్టిన జనరేటర్, బిల్డింగ్ లో అక్రమంగా నిర్మించిన టాయిలెట్ లను తొలగించలేదని తెలిపారు. మరో ఇరవైనాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకుంటే, మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. 

Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >
Image 1

"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి

Posted On 2026-04-18 13:51:32

Readmore >